TAMA Dasara and Bathukamma Vedukalu - Details
Location : Zoom Call / Facebook Live / Youtube Live
NA
Atlanta, GA NA
ధూంధాంగా దసరా బతుకమ్మ వేడుకలు
కళ్ళకి ఇంపుగా ఉండే రకరకాల పూలతో బతుకమ్మలని పేర్చి అందంగా చూడముచ్చటగా పట్టు చీరలు కట్టుకొని అట్లాంటా ఆడపడుచులు ఈ నెల శనివారం అక్టోబర్ 17 2020 వ తారీఖు న తామా వారు నిర్వహించిన ఆన్లైన్ దసరా మరియు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని వారి ఆట పాటలతో ప్రేక్షకులని రంజింప చేసారు. శ్రీ.డాక్టర్ శ్రీనివాస్ కోడాలి గారు మరియు శ్రీ. విజయ్ కొత్తపల్లి గారు సమర్పించారు.
మొదటగా తామా సాంస్కృతిక కార్యదర్శి శ్రీ. సురేష్ బండారు గారు స్వాగతం పలకగా, తామా అధ్యక్షులు శ్రీ. భరత్ మద్దినేని గారు తామా కార్యక్రమాలను వివరించారు. దసరా మరియు బతుకమ్మ వేడుకలకు V6 మరియు ఇస్మార్ట్ న్యూస్ ఫేమ్ మన శివ జ్యోతి వ్యాఖ్యాత గా వ్యవహరించడం ఉత్సహాన్ని పెంచింది. అలాగే బతుకమ్మ పాట అనగానే మనకు గుర్తు వచ్చే గొంతు శ్రీ. మంగ్లీ గానం. ఎంతో వైవిధ్యంగా తన దైన రీతిలో జానపదాలను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కవి మరియు MLA శ్రీ.రసమయి బాలకిషన్ గారు ఆలపించిన జానపద గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించిన తామా వెబ్సైట్ ను రసమయి గారి చేతులమీదుగా ఆవిష్కరించారు.
తదనంతరం మన అట్లాంటా లో నివసించే స్థానిక నృత్య మరియు సంగీత అకాడమీ విద్యార్థులు నవరాత్రి అమ్మవారు మరియు బతుకమ్మ ఆట పాటలతో మంత్రముగ్దులను చేసారు. అయితే బతుకమ్మ సంబరాలలో భాగంగా తామా వారు బతుకమ్మ పోటీలు ఆన్లైన్ లో నిర్విహంచడం అభినందనీయం. ఈ పోటీలను తామా మహిళా కార్యదర్శి శ్రీ. సునీత పొట్నూరు నిర్వించగా, పోటీలకు న్యాయ నిర్ణేతలుగా స్థానిక అట్లాంటా వాస్తవ్యులు శ్రీమతి.స్నేహ బుక్కరాయసముద్రం మరియు శ్రీమతి సంధ్య చిలువేరు వ్యవహరించారు. పోటీదారులు మొదటి బహుమానం $250 శ్రీమతి. సుప్రియ కొనిశెట్టి, రెండవ బహుమతి $150 శ్రీమతి. రమాదేవి దూడల మరియు మూడవ బహుమతి $100 శ్రీమతి. రాజమణి తలారి గెలుచుకున్నారు. చివరగా తామా సెక్రెటరీ శ్రీ. రవి కల్లి గారు స్పాన్సర్స్ కి, ప్రేక్షకులకి అలాగే ఈ వర్చ్యువల్ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ హితేష్ వడ్లమూడి గారికి కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
